యుద్ధ చంద్రుడు

అమెరికా సామ్రాజ్యవాదం మరియు సద్దాం హుస్సేన్ ఉరి గురించి శివసాగర్ వ్రాసిన కవిత:

ఆకాశం అస్తి పంజరం మెడకు
వేలాడుతున్న యుద్ధ చంద్రుడు
వాడి ఒళ్ళంతా అణు బాంబులే
వాడి కళ్ళలో కసాయితనం కోరలు
పెంటగాన్ పెను కంకాళం మీద
న్యాయమూర్తిగా కూర్చుని
వాడు కొన్ని దేశాలకు ఉరిశిక్ష విధిస్తాడు

వాడికి లేదు పౌర్ణమి,
ఉన్నదంతా అమావాస్యే!

0 comments:

Post a Comment

వ్యాఖ్యలు తెలుగులో టైప్ చెయ్యడానికి లేఖిని లేదా ఫైర్ ఫాక్స్ ఇండిక్ ఇంపుట్ ఎక్స్టెన్షన్ వాడండి.